లండన్: వింబుల్డన్‌లో టాప్ సీడ్ ప్లేయర్ల జోరు కొనసాగుతోంది. గురువారం జరిగిన మెన్స్ సింగిల్స్ రెండో రౌండ్‌లో జర్మనీ స్టార్ ప్లేయర్ అలెగ్జాండర్ జ్వెరెవ్ 6–1, 6–3, 7–6 (7/3)తో వాలెంటిన్ రోయర్ (ఫ్రాన్స్)పై గెలిచి మూడో రౌండ్‌లోకి ప్రవేశించాడు. రెండు గంటలా 4 నిమిషాల మ్యాచ్‌లో జ్వెరెవ్ అటాకింగ్ గేమ్‌తో ఆకట్టుకున్నాడు. బలమైన సర్వీస్‌లతో 14 ఏస్‌లు సంధించాడు. రెండు డబుల్ ఫాల్ట్స్ మాత్రమే చేసి తన సర్వీస్‌లో 76 శాతం పాయింట్లు రాబట్టాడు. ఎనిమిది బ్రేక్ పాయింట్లలో ఐదింటిని కాచుకున్నాడు. 37 విన్నర్లు, 28 అన్‌ఫోర్స్‌డ్ ఎర్రర్స్‌తో మ్యాచ్ ముగించాడు. ఒకే ఒక్క బ్రేక్ పాయింట్‌ను కాచుకున్న రోయర్.. 15 విన్నర్లు, 22 అన్‌ఫోర్స్‌డ్ ఎర్రర్స్‌తో మూల్యం చెల్లించుకున్నాడు. 3 ఏస్‌లు, 2 డబుల్ ఫాల్ట్స్ చేశాడు. ఇతర మ్యాచ్‌ల్లో టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా) 6–-2, 6-–2, 7-–5తో కిప్సన్ (అమెరికా)పై, రాఫెల్ జోదర్ (స్పెయిన్) 3-–6, 6–-3, 1–-6, 6–-3, 6–-4తో కారెనో బుస్టా (స్పెయిన్)పై, డి మినుయెర్ (ఆస్ట్రేలియా) 6-–3, 6–-2, 6–-2తో మన్నారినో (ఫ్రాన్స్)పై గెలిచి ముందంజ వేశారు.
విమెన్స్ సింగిల్స్ రెండో రౌండ్‌లో మూడోసీడ్ స్వైటెక్ (పోలెండ్) 6–1, 6–3తో కరోలినా ప్లిస్కోవా (చెక్)పై గెలిచింది. గంటా 10 నిమిషాల మ్యాచ్‌లో ఒక్క ఏస్ కూడా కొట్టని స్వైటెక్ ఐదు డబుల్ ఫాల్ట్స్ చేసింది. అయితే ఆరు బ్రేక్ పాయింట్లను కాచుకుంది. 17 విన్నర్లు, 18 అన్‌ఫోర్స్‌డ్ ఎర్రర్స్ చేసింది. 7 విన్నర్లు, 23 అన్‌ఫోర్స్‌డ్ ఎర్రర్స్ చేసిన ప్లిస్కోవా 2 ఏస్‌లు, 5 డబుల్ ఫాల్ట్స్ చేసింది. ఇతర మ్యాచ్‌ల్లో మాడిసన్ కీస్ (అమెరికా) 6–1, 6–4తో కేటీ స్వాన్ (బ్రిటన్)పై, అనిసిమోవా (అమెరికా) 6–2, 4–6, 7–6 (10/3)తో కెనిన్ (అమెరికా)పై, ఆండ్రీ ఎలా (చెక్) 3–6, 6–2, 6–0తో మోయా జాయింట్ (ఆస్ట్రేలియా)పై, సమసనోవా (రష్యా) 6–4, 4–6, 6–2తో ష్నైడర్ (రష్యా)పై, మార్టా కోస్టుక్ (ఉక్రెయిన్)6–7 (5/7), 6–3, 6–3తో బ్లింకోవా (రష్యా)పై గెలిచారు.
